రంగారెడ్డి నందిగామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బైపాస్‌పై ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగింది. కారులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు.
షాద్‌నగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులు హైదరాబాద్ చాంద్రాయణగుట్టకు చెందిన చిన్నారులు ఫజన్ మహబూబ్ ఖాన్(7), ఉక్ష అదిల్ ఖాన్(13)గా గుర్తించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి: దారుణం: భర్తపై అనుమానంతో భార్య యాసిడ్ దాడి