ETV Bharat / jagte-raho

కామారెడ్డిలో యువకుడి దారుణ హత్య - కామారెడ్డి జిల్లా నేర సమాచారం

మద్యం బాటిళ్లతో విచక్షణరహితంగా దాడి చేసి ఓ యువకున్ని దారుణంగా హత్యచేశారు గుర్తుతెలియని దండగులు. కామారెడ్డి జిల్లా శాబ్దిపూర్ గ్రామ శివారులో రహదారి పక్కనే ఈ ఘటన జరిగింది.

The brutal murder of a young man in kamareddy dist
కామారెడ్డిలో యువకుడి దారుణ హత్య
author img

By

Published : Dec 1, 2020, 9:20 PM IST

కామారెడ్డి జిల్లా శాబ్దిపూర్​ గ్రామ శివారులో దారుణం జరిగింది. మద్యం బాటిళ్లతో కొట్టి ఓ యువకుడిని హత్యే చేశారు గుర్తుతెలియని కిరాతకులు. పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన అల్లం ప్రభుదాస్(22) నిన్న సాయంత్రం సైకిల్​పై ఇంటినుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు చాలాచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు.

రామేశ్వర్​పల్లి తాండకు చెందిన గొర్లకాపరి శాబ్దిపూర్ గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసుల క్లూస్​ టీం వివరాలు సేకరించింది. మరికొందరితో కలిసి మద్యం సేవిస్తుండగా బాటిళ్లతో కొట్టి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతుడు వెంట తెచ్చుకున్న సైకిల్ కనపడటం లేదని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్​రెడ్డి వెల్లడించారు.

ఇదీ చూడండి:కోతుల దాడి.. బిడ్డను కాపాడుకోబోయి బాలింత మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.