వరంగల్ అర్బన్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. ఈఘటన భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌లో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం గ్రామానికి చెందిన నలుగురు పిల్లలతో కలిసి ఓ బాలుడు స్థానిక చెరువులో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో తాళ్లపల్లి విజయ్ కుమార్ నీటిలో మునిగిపోయాడు. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడం వల్ల నలుగురు పిల్లలు ఏం తెలియనట్టు వారి ఇళ్లకు వెళ్లిపోయారు.
విజయ్‌కుమార్ తల్లి తల్లిదండ్రులు తన కొడుకుతో వెళ్లిన నలుగురు పిల్లల్ని ప్రశ్నించడం వల్ల చెరువులో మునిగి చనిపోయాడని వారు తెలపారు. గ్రామంలోని పలువురు యువకుల సాయంతో బాలుని మృతదేహాన్ని వెలికి తీశారు. విజయ్‌కుమార్ ఐదో తరగతి పూర్తి చేశాడు. తమ కొడుకును చెరువులోకి తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఎస్సై స్వప్న తెలిపారు.
ఇదీ చూడండి : ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్