నిజామాబాద్ నగర శివారులోని బోర్గం వాగులో ఈతకు వెళ్లిన ఓ బాలుడు నీటి మునిగి మృతి చెందాడు. శ్రీనగర్ కాలనీ చెందిన సిద్ధార్థ్(11) బుధవారం వాగులో ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడం వల్ల నీటిలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు.
నీటి ప్రవాహం ఎక్కవగా ఉండటంతో బుధవారం బాలుడి ఆచూకీ లభించలేదు. గురువారం ప్రవాహం తగ్గటంతో మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా ముళ్లపొదల్లో మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: అధికారులు సహకరించటం లేదని సర్పంచ్ ఆత్మహత్యాయత్నం