ఏపీలోని విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రాయవలస గ్రామానికి చెందిన కొంతమంది గొర్రెలు వింత వ్యాధితో చనిపోవడం ఆ గ్రామంలో సంచలనం రేపింది. గ్రామానికి చెందిన ఈడ దాసు తవుడు, ఆరుద్రకు చెందిన 10 గొర్రెలు వింత వ్యాధితో మృతి చెందడం వల్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నడూ లేని విధంగా ఇలా జరగడంపై స్థానికులు కూడా ఆవేదన ఆందోళనకు గురవుతున్నారు. లక్ష వరకు నష్టం జరిగిందని బాధితులు వాపోయారు . ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. నిమోనియా వ్యాధితో ఊపిరితిత్తులు పొంగి పోవడం వల్లే చనిపోయాయని చీపురుపల్లి వెటర్నరీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మోహన్ రావు నిర్ధారించారు.
ఇదీ చదవండి: భవనంపై పుర్రె.. ఎక్కడిది.. ఎవరిదై ఉంటుంది?