తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 235 మంది విద్యార్థులు బిష్కేక్లోని ఏషియన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. కిర్గిస్థాన్‌లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ దేశ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా 235 మంది విద్యార్థులు స్వదేశం రావడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కొక్కరు రూ.45 వేలు ఏజెంట్‌కు చెల్లించారు. వీరిలో తెలంగాణకు చెందిన 170 మంది, ఆంధ్రకు చెందిన 65మంది విద్యార్థులున్నారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు విమానం ఉందని ఏజెంట్ చెప్పడంతో విద్యార్థులంతా బిష్కేక్లోని మానస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లాక రాయబార కార్యాలయ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో విమానం రద్దయిందని ఏజెంట్ తెలిపాడు. ఫలితంగా 12 గంటల పాటు విద్యార్థులందరూ అక్కడే ఆందోళన చేశారు. కనీసం మంచినీళ్లు కూడా అందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమను భారత్‌కు తీసుకురావాలని కోరుతున్నారు.
ఇదీచూడండి: తక్కువ ఖర్చుతో కరోనా పరీక్ష.. 2 నూతన పద్ధతులు అభివృద్ధి