గుజరాత్‌లోని సూరత్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ అడిక్‌మెట్ ఆంజనేయ స్వామి ఆలయ ఈఓ శ్రీనివాస్, పాన్‌బజార్ వేణుగోపాల స్వామి దేవస్థాన జూనియర్ అసిస్టెంట్ రమణ మృతి చెందారు. వీరి మృతిపట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ఘటనలో గాయపడిన ఈఓ సత్యనారాయణ, పూజారి వెంకటేశ్వర్లు, క్లర్క్ కేశవరెడ్డిని అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్‌ను మంత్రి ఆదేశించారు. ఉత్తరాది నదీ జలాల కోసం వీరంతా గుజరాత్ వెళ్లినట్లు సమాచారం.
- ఇదీ చూడండి : గండిమైసమ్మ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య!