ETV Bharat / jagte-raho

భవనంపై నుంచి పడి ప్రైవేటు టీచర్​ మృతి - నేర వార్తలు

ఆదిలాబాద్​ రిమ్స్​ వైద్య కళాశాల భవనం మూడో అంతస్తు నుంచి పడి ఓ టీచర్​ మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ నెల 15న అనారోగ్యంతో అతను రిమ్స్​ ఆస్పత్రిలో చేరాడు.

teacher died at rims hospital
భవనంపై నుంచి పడి ప్రైవేటు టీచర్​ మృతి
author img

By

Published : Nov 18, 2020, 9:34 AM IST

ఆదిలాబాద్‌ రిమ్స్‌ వైద్యకళాశాల భవనం మూడో అంతస్తునుంచి పడి ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది. పట్టణంలోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న రామగిరి రామకృష్ణ ఈనెల 15న అనారోగ్యంతో రిమ్స్‌లో చేరాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రి భవనం మూడో అంతస్తుపై నుంచి పడిపోయాడు. వైద్యులు పరీక్షించగా అప్పటికే అతను మృతి చెందాడు.

అతను ప్రమాదవశాత్తు పడి మరణించాడా లేక ఆత్మహత్యచేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.