నిజామాబాద్ జిల్లాలో భారీ మొత్తంలో నిషేధిత జిలెటిన్‌స్టిక్స్, డిటోనేటర్స్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ధర్పల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోదాలు నిర్వహించారు.
తనిఖీల్లో 202 జిలెటిన్‌స్టిక్స్, 100 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ, సిబ్బంది తనిఖీ చేసి నిషేధిత పదార్థాలు పట్టుకున్నారు. వీటిని నిల్వ ఉంచిన వ్యక్తి పరారీలో ఉన్నారు.
ఇదీ చదవండి: కోడి కూర వండలేదని భార్యను హతమార్చిన భర్త...