ETV Bharat / jagte-raho

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. నగదు స్వాధీనం

author img

By

Published : Oct 12, 2020, 8:59 AM IST

గుట్టుచప్పుడు కాకుండా ఐపీఎల్​ క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ముఠాను టాస్క్​ఫోర్స్​ పోలీసులు పట్టుకున్నారు. కుల్సుంపురా పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి మొబైల్స్​, నగదు స్వాధీనం చేసుకున్నారు.

taskforce police Arrest cricket betting team in hyderabad
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. నగదు స్వాధీనం

హైదరాబాద్​లోని కుల్సుంపురా పోలీస్​ స్టేషన్ పరిధిలో టాస్క్​ఫోర్స్​ పోలీసులు క్రికెట్ బెట్టింగ్​ నిర్వహిస్తున్న ముఠాపై దాడులు చేశారు. టాస్క్​ఫోర్స్​ డిప్యూటి కమిషనరర్​ రాధాకృష్ణ రావు పర్యవేక్షణలో టాస్క్​ఫోర్స్​ ఎస్సై గట్టుమల్లు, వెస్ట్​ జోన్​ ఎస్సై రంజిత్​ కుమార్​, మల్లిఖార్జున్​, ముజాఫర్​ అలీ తదితర సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.

ఈ దాడుల్లో ముఠాలోని ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిందితుల్లో ఒకరు ఆకాష్, మరొకరు వినయ్​ సింగ్​. ఆకాష్​ కార్​వాషింగ్​ సెంటర్​లో పనిచేస్తుండగా.. వినయ్​ సింగ్​ సర్వీసింగ్​ సెంటర్​ నిర్వహిస్తున్నాడు. మరికొందరితో కలిసి వీరు క్రికెట్​ బెట్టింగ్​ నిర్వహిస్తుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న పోలీసులు.. వీరి వద్ద నుంచి రూ.1 లక్షా 20 వేల నగదు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. విచారణ నిమిత్తం నిందితులను కుల్సుంపురా పోలీసులకు అప్పగించారు.

ఇవీ చూడండి: 'సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోకూడదో చూపిస్తున్న కేంద్రం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.