నిషేధిత గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్న స్థావరాలపై నిజామాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్కాను సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి.. నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
లక్ష రూపాయల విలువగల గుట్కాను సీజ్ చేశారు. ఒక జుపిటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఎమ్‌డీ గుట్కా యజమాని మొహమ్మద్ ఆరిఫ్‌తో పాటుగా విమల్ గుట్కా యజమాని మొహమ్మద్ అబ్దుల్ మాజిద్పైన కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: కొడుకు మృతిని తట్టుకోలేక... తల్లిదండ్రులు అదృశ్యం