వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో లక్షా 82 వేల రూపాయల విలువ చేసే గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని.... 2 బ్యాగుల్లో 40 గుట్కా ప్యాకెట్లు, ఒక టవేరా కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.
హైదరాబాద్ బేగంబజార్‌కి చెందిన రతన్‌లాల్ బాటి అనే వ్యక్తి నుంచి నిందితులు గుట్కాలు కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.