ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రెండు ముఠాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్ గాంధీ నగర్లో ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకొని గాంధీ నగర్ పోలీసులకు అప్పగించారు. వారి వద్ద నుంచి ఒక ప్రొజెక్టర్, ఒక సెటప్ బాక్స్, 5 సెల్ ఫోన్లు, రూ.25వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
మరోచోట ముషీరాబాద్‌లోని పార్శీగుట్టలో ఓ ఇంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. వారి నుంచి ఒక ఎల్ఈడీ టీవీ, సెటప్ బాక్స్, 6 సెల్ ఫోన్లు, రూ.39,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: రూ. 11.5 లక్షల విలువైన గుట్కా పట్టివేత.. వ్యక్తి అరెస్ట్