ETV Bharat / jagte-raho

అత్తారింటికి వెళ్లాడు.. అనుమానాస్పదంగా మృతి చెందాడు.. - వికారాబాద్​ నేరవార్తలు

భార్యతో కలిసి అత్తారింటికి వెళ్లాడు.. స్నేహితులు వస్తే.. వారితో బయటకు వెళ్లాడు. ఇక మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. ఒకరోజు గడిచాక.. అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. అసలేం జరిగింది?

man death
అత్తారింటికి వెళ్లాడు.. అనుమానాస్పదంగా మృతి చెందాడు..
author img

By

Published : Sep 12, 2020, 11:22 AM IST

వికారాబాద్​ జిల్లా పరిగి మండలం గడిసింగాపూర్​ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతుడు ఎవరు..? మృతికి గల కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి

మృతుడు వికారాబాద్​ జిల్లా రాకంచర్లకు చెందిన గోపాల్​గా (40) గుర్తించారు. రెండ్రోజుల క్రితం అత్తగారిల్లైన దిర్సంపల్లి తాండాకు తన భార్యతో కలిసి వెళ్లాడు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్తానని చెప్పి వెళ్లిన గోపాల్​ ఒకరోజు దాటినా ఇంటికి రాలేదు. ఇవాళ ఉదయం గడిసింగాపూర్​ సమీపంలోని చింతలచెరువు దగ్గర అనుమానాస్పద స్థితిలో గోపాల్​ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి కాళ్లపై విద్యుత్​ తీగలు తగిలినట్లు ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: అప్పుల బాధ తాళలేక రైతు బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.