ETV Bharat / jagte-raho

అనుమానస్పదంగా బాలిక మృతి.. ఆ ముగ్గురు యువకులే కారణమా!? - death of a minor in Rebelle

వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం రేబల్లెలో... ఏడో తరగతి బాలిక అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే...?

minor girl
అనుమానస్పదంగా బాలిక మృతి.. ఆ ముగ్గురు యువకులే కారణమా?
author img

By

Published : Dec 7, 2020, 4:22 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా రేబల్లె గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త చనిపోవడంతో.. కూతురుతో కలిసి పుట్టింట్లో నివాసముంటుంది. ఆమె కుమార్తె.. ప్రస్తుతం కరోనా కారణంగా ఇంటివద్దే ఉంటుంది. గత నెల27న బాలిక అస్వస్థతకు గురైందని ఓ ఆర్​ఎంపీ వైద్యునికి చూపించారు.

పరిస్థితి విషమించడంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా... బాలిక అప్పటికే మృతి చెందింది. ఆ రోజే బాలిక మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి ఖననం చేశారు. తన కూతురు సెల్‌ఫోన్‌లో ముగ్గురు యువకుల మెసేజ్‌లు ఉన్నాయని... మృతికి ఆ యువకులు కారణమై ఉండవచ్చని మహిళ అనుమానం వ్యక్తం చేస్తోంది.

వారిని విచారించి చర్యలు తీసుకోవాలని ఈనెల 3న సీపీకి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై దుగ్గొండి ఎస్సైని వివరణ కోరగా... పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదని దాని ఆధారంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.