ETV Bharat / jagte-raho

సంపులో పడి ఇద్దరు చిన్నారుల అనుమానాస్పద మృతి - గడ్డంపల్లిలో విషాదం

నాగర్ కర్నూల్ జిల్లా గడ్డంపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంపులో పడి ఇద్దరు చిన్నారుల అనుమానస్పద మృతి

author img

By

Published : Nov 10, 2020, 9:31 PM IST

నాగర్ కర్నూల్ జిల్లా గడ్డంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన ఘటనతో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన నిర్మలయ్య, భాగ్యలక్ష్మి దంపతుల పిల్లలు సిద్దు, అమ్ములు అనుమానాస్పదస్థితిలో సంపులో పడి మృతి చెందారు.

కొంతకాలంగా దంపతుల మధ్య వివాదాలు ఉన్నాయి. భాగ్యలక్ష్మి ఇద్దరు పిల్లలు తీసుకుని తల్లిగారి గ్రామమైన పెద్దాపూర్ కు వెళ్లింగి. మూడు రోజుల క్రితం నిర్మలయ్య భార్య వద్దకు వెళ్లి మాట్లాడాడు. భార్య నిరాకరించగా పిల్లలను తీసుకొని గ్రామానికి చేరుకున్నాడు.

ఈరోజు ఉదయం ఇద్దరు చిన్నారులు మృతి చెందగా పలు అనుమానాలకు తావిస్తోంది. భార్యాభర్తల మధ్య పరస్పరం గొడవలు జరగడం ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలు సంపులో పడి మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: బిహార్​లో 'భాజపా' జోరు- ఎన్​డీఏ రయ్​ రయ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.