మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం స్కూల్ తండాకు చెందిన యువకుడు మాలోత్ నవీన్... గురువారం అనుమానాస్పదంగా చెరువులో పడి మృతి చెందాడు. శుక్రవారం మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తండాకు తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయని, పాత కక్షలతో పథకం ప్రకారం చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు.
మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానితులపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగి పరిస్థితి కొట్టుకునే వరకు వెళ్లింది. విషయం తెలిసి హవేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ విఠల్, ముగ్గురు కానిస్టేబుల్లు స్కూల్ తండాకు వెళ్లి వారిని ఆపే ప్రయత్నం చేశారు. పోలీసుల వాహనంపై వారు దాడిచేసి ధ్వంసం చేశారు.
ఇదీ చూడండి: కొవిడ్ ఎఫెక్ట్.. జీతంలేక ఐమ్యాక్స్‌లో పనిచేసే ఉద్యోగి ఆత్మహత్య..