ETV Bharat / jagte-raho

'చిన్నారిపై హత్యాచారం కేసులో యావజ్జీవం సరైందే'

supreme judgement in hanmakonda baby rape and murder case
'చిన్నారిపై హత్యాచారం కేసులో యావజ్జీవం సరైందే'
author img

By

Published : Jun 16, 2020, 7:08 PM IST

Updated : Jun 16, 2020, 8:06 PM IST

19:02 June 16

'చిన్నారిపై హత్యాచారం కేసులో యావజ్జీవం సరైందే'

గతేడాది జూన్​లో హన్మకొండలో చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన దోషికి విధించిన యావజ్జీవ శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. ట్రయల్​ కోర్టు విధించిన ఉరిశిక్షను తెలంగాణ హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరణశిక్ష విధిస్తే... సమాజంలో నేరస్థులకు సరైన సంకేతాలు వెళ్తాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. హైకోర్టు తీర్పు కూడా దోషికి పూర్తిస్థాయిలో శిక్ష విధించినట్టుగానే ఉందన్న జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​ ధర్మాసనం... తెలంగాణ ప్రభుత్వ పిటిషన్​ను కొట్టేసింది. ఈ మేరకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Jun 16, 2020, 8:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.