వేధింపులు భరించలేక ఓ నవజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో చోటు చేసుకుంది. వరుడు చనిపోగా... వధువు చికిత్స పొందుతోంది. కోటగిరికి చెందిన సాయిప్రణీత్, విజయ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. 15 రోజులుగా కిందట వివాహం చేసుకున్నారు.
వీరి పెళ్లికి అబ్బాయి ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్ల అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లారు. అప్పటి నుంచి వారి కుటుంబంలో కలహాలు ఎదురయ్యాయి. మనస్తాపం చెంది ఇరువురు కలిసి చనిపోదామని భావించారు. పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయి ప్రణీత్ మృతి చెందారు. ప్రస్తుతం విజయ చికిత్స పొందుతోంది.
కేసు నమోదు చేసుకున్న కోటగిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువ జంట ఆత్మహత్యాయత్నానికి ముందు రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. అందులో అమ్మాయి తల్లి పెట్టే బాధలు భరించలేకే... ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వధువు విజయ పేర్కొన్నారు. నిత్యం వేధింపులు, చిత్రహింసలు గురిచేసేవారని భరించలేకే అఘాయిత్యానికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉమ్మడి పాలమూరులో వివక్ష తగ్గింది.. చిట్టితల్లి నవ్వింది..