నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానంపల్లి గ్రామానికి చెందిన గడిల కిషన్ తన భూమిని కబ్జా చేయాడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ... కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాడానికి వెళ్లాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న డీజిల్‌ను ఒంటి మీద పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిని కాపాడారు.
![Suicide attempt by land victim in Nizamabad Collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-10-09-athma-yathnam-avb-ts10123_09112020135128_0911f_1604910088_529.jpg)
యానంపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 43/17, 43లో మొత్తం 3 ఎకరాల 20 గుంటల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు బాధితుడు. అయితే అదే గ్రామానికి చెందిన డిచ్పల్లి జడ్పీటీసీ దాసరి ఇంద్ర భర్త తెరాస నాయకుడు దాసరి లక్ష్మీ నర్సయ్య... తనని బెదిరిస్తూ.. వేసిన పంటలను గోర్లతో మేపుతూ... ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బాధితుడు ఆరోపించాడు.
![Suicide attempt by land victim in Nizamabad Collectorate](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-10-09-athma-yathnam-avb-ts10123_09112020135128_0911f_1604910088_476.jpg)
2018లో కేసు పెట్టినా... ఎలాంటి స్పందన లేదని.. సమగ్ర విచారణ చేసి భూమి తమకు ఇవ్వాలని కోరారు. కలెక్టర్ నారాయణ రెడ్డి వినతి పత్రం పరిశీలించి విచారణ జరిపి న్యాయం చేస్తానని భరోసా కల్పించారు.
- ఇదీ చదవండిః మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్