గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఓ పెట్రోల్ బంక్లో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ద్విచక్ర వాహనానికి పెట్రోల్ నింపే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో అక్కడి సిబ్బంది సకాలంలో స్పందించి మంటల్ని అదుపు చేశారు. పెట్రోల్ నింపే సమయంలో చరవాణి వాడటం వలన ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి : కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు నిధుల్లేవు: ఆర్టీసీ యాజమాన్యం