ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోన్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చిన్న కమేల ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ అనే విద్యార్థి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇంటర్ పూర్తి చేసిన అజయ్ కొద్ది రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. మంగళవారం నాడు తిరుమలగిరి ప్రాంతంలోని ఓ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన అధికారులు అతను చనిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నామని వివరించారు. అజయ్ ఆకస్మిక మరణంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 635 కరోనా కేసులు.. 4 మరణాలు