వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం రాంధన్ తండాలో ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో స్థానికులు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.
భయాందోళనకు గురైన స్థానికులు.. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. 3గంటలు గడిచినా సిబ్బంది రాకపోవడంతో.. గ్రామస్థులే నీటి బిందెలతో మంటలను ఆర్పేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆలస్యంగా ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బందితో స్థానికులు ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: హత్య చేసిందొకరు.. కటకటాల పాలయిందేమో ఐదుగురు!