హైదరాబాద్ పాతబస్తీలో పాత కక్షల కారణంగా యువకుడిని హత్య చేసిన కేసులో దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కాలాపత్తర్‌కు చెందిన షేక్ మహమ్మద్ ఐదు రోజుల క్రితం మీర్ ఆలం ట్యాంకు సమీపంలో హత్యకు గురయ్యాడు.
అతని స్నేహితుడు సాజిత్తో పాటు మరో ఐదుగురు కలిసి హత్యచేసినట్లు గుర్తించిన పోలీసులు.. వాళ్లను అరెస్ట్ చేశారు. నిందితులంతా కూడా కాలాపత్తర్ ప్రాంతానికే చెందినవారేనని టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి తెలిపారు.