ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో.. ప్రేమ్ కుమార్ అనే యువకుడు ఇటీవల మరణించాడు. అతనికి తండ్రి రామిరెడ్డి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయంపై.. మృతుడి సోదరుడు సోమిరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి రామిరెడ్డే.. ప్రేమ్ కుమార్‌ను హతమార్చాడని ఫిర్యాదు చేశారు. మొదటి భార్య చనిపోయిన తర్వాత రామిరెడ్డి రెండో వివాహం చేసుకుని మొదటి సంతానాన్ని నిర్లక్ష్యం చేశాడని.. ఈ క్రమంలోనే ప్రేమ్‌తో గొడవ పడి చంపేశాడని ఫిర్యాదులో సోమిరెడ్డి పేర్కొన్నారు.
అంతే కాక.. ప్రేమ్ కుమార్‌కు కామెర్లు వచ్చాయని అబద్ధం చెప్పి అంత్యక్రియలను పూర్తి చేశాడని పోలీసులకు చెప్పారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం చేయించారు. నివేదిక వచ్చాక.. ప్రేమ్ కుమార్ మృతికి కారణాలు తెలుస్తాయని చెప్పారు.
ఇదీ చదవండి: తెలంగాణ: సూర్యాపేటలో స్థిరాస్తి వ్యాపారి దారుణ హత్య