ETV Bharat / jagte-raho

తల్లి ఆన్​లైన్​ క్లాసులు వినమన్నందుకు ఇల్లు వదిలేశాడు!

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఆన్​లైన్​ క్లాసులపై శ్రద్ధ పెట్టమంటూ తల్లి మందలించగా బాలుడు ఇల్లు వదిలివెళ్లియాడు. తాను తిరుపతిలో ఉన్నానని ఫోన్​ చేయగా.. పోలీసుల సహాయంతో తల్లిదండ్రులు అక్కడకు పయనమయ్యారు.

boy left home as mother scold him
తల్లి ఆన్​లైన్​ క్లాసులు వినమందంటూ ఇల్లు వదిలేశాడు!
author img

By

Published : Oct 1, 2020, 12:34 PM IST

ఆన్​లైన్​ క్లాసులపై శ్రద్ధ పెట్టమంటూ తల్లి మందలించగా బాలుడు ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఘటన మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. మహబూబ్​నగర్​కు చెందిన మహేందర్​ గుప్తా.. తన కుటుంబంతో కేపీహెచ్​బీ నాలుగో ఫేజులో నివసిస్తున్నారు. తొమ్మిదో తరగతి చదువుతున్న వారి కుమారుడు ఎస్​.భవిత్​ ఆన్​లైన్​ క్లాసుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నందున తల్లి సంతోషి మందలించింది. మనస్తాపంతో భవిత్​ మంగళవారం ఇల్లు విడిచి వెళ్లాడు.

భవిత్​ కనిపించకపోగా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తాను తిరుపతిలో ఉన్నానని బాలుడు ఫోన్​ చేయగా అతన్ని వెనక్కి తీసుకువచ్చేందుకు పోలీసులతో కలిసి తల్లిదండ్రులు తిరుపతి వెళ్లారు. గురువారం సాయంత్రానికి వారు ఇంటికి చేరే అవకాశముందని కేపీహెచ్​బీ సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

ఇదీ చదవండిః హాథ్రస్‌ ఘటనపై వివరణ ఇవ్వండి: ఎన్‌హెచ్‌ఆర్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.