ETV Bharat / jagte-raho

సాఫ్ట్​వేర్​ సంస్థలో పని చేస్తున్న వివాహిత అదృశ్యం - missing cases latest update\

ఓ సాఫ్ట్​వేర్​ సంస్థలో పని చేస్తున్న వివాహిత అదృశ్యమైన ఘటన బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

software employee missing in bowenpally police station limits
సాఫ్ట్​వేర్​ సంస్థలో పని చేస్తున్న వివాహిత అదృశ్యం
author img

By

Published : Dec 8, 2020, 3:49 AM IST

ఓ సాఫ్ట్​వేర్​ సంస్థలో పని చేస్తున్న వివాహిత అదృశ్యమైన ఘటన బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాజస్థాన్​కు చెందిన పృథ్వీ సింగ్, మింటు రాజపుత్ దంపతులు బోయిన్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని తాడ్​బండ్​ వద్ద నివాసం ఉంటున్నారు. వీరికి ఇటీవలే వివాహం కాగా.. 15 రోజులకు ఒకసారి రాజస్థాన్​లోని వారి తల్లిదండ్రులను చూసొచ్చేవారు. ఈ క్రమంలో లాక్​డౌన్ విధించినప్పటి నుంచి మింటు రాజపుత్ రాజస్థాన్​కు వెళ్లకపోవటం వల్ల ఆమె సోదరుడు జితేందర్ మింటును తీసుకెళ్లడానికి తాడ్​బండ్​కు వచ్చాడు.

రాజస్థాన్​కు విమానంలో వెళదామని మింటు ప్రతిపాదించడం వల్ల జితేందర్​ సరే అన్నాడు. తీరా విమానాశ్రయానికి వెళ్లే సరికి విమానం మిస్ కావడంతో బస్సులో వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. జితేందర్​ బస్సు టికెట్లు బుక్ చేస్తున్న క్రమంలో మింటు కనబడకుండా పోయింది. తన సోదరి కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్..ల జితేందర్​ వెంటనే బోయిన్​పల్లి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: విదేశీ యువతులతో వల.. బెజవాడలో హైటెక్​ వ్యభిచారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.