కూకట్‌పల్లిలోని జయనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కోతిని తరమబోయి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జహీరాబాద్‌కు చెందిన లోకేశ్ రెండు నెలల క్రితం ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి వచ్చి... జయనగర్‌లో నివాసముంటున్నాడు.
అక్కడికక్కడే..
కొవిడ్ కారణంగా ఇంటి వద్ద నుంచే పని చేస్తున్నాడు. వీరి ఇంటికి తరచూ కోతులు వచ్చి ఇబ్బంది పెడుతుండడంతో కోతిని తరిమేందుకు ఇనుపరాడ్‌తో బయటకు వచ్చాడు. ఈ క్రమంలో రాడ్ విద్యుత్ తీగలకు తగలడంతో లోకేశ్ అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.
స్పందన లేదు..
కోతుల బెడదపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని వాపోయారు. ఇళ్ల మధ్యలో హైటెన్షన్ వైర్లు ప్రమాదకరంగా ఉంటున్నాయని వాపోయారు. సమస్యను త్వరలోనే పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: నివాసాలపై మృత్యు పాశాలుగా విద్యుత్ హై వోల్టేజీ లైన్లు