ETV Bharat / jagte-raho

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఉద్యోగి మృతి - peddapalli district news

గుర్తు తెలియని వాహనం ఢీకొని సింగరేణి ఉద్యోగి మృతి చెందాడు. బుధవారం రెండో షిప్టు విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

singareni employee dead in road accident at ramagiri in peddapalli
గుర్తు తెలియని వాహనం ఢీ... సింగరేణి ఉద్యోగి మృతి
author img

By

Published : Nov 14, 2020, 11:31 AM IST

విధులు ముగించుకుని తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని సింగరేణి ఉద్యోగి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీ జేఎన్​టీయూ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డాడు.

ఇంక్లైన్ కాలనీలో నివాసం ఉంటున్న కాచారం నాగేశ్వరరావు ఓసీపీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజూలాగే బుధవారం రెండో షిప్టులో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా జేఎన్టీయూ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తల వెనుక తీవ్ర గాయాలు కావడంతో సింగరేణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాగేశ్వరరావు మృతి చెందాడు.

రామగిరి పోలీస్ స్టేషన్​లో మృతుని కుమారుడు రోహిత్ ఫిర్యాదుతో... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: రజక్​పల్లిలో అప్పుల బాధతో రైతు బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.