ETV Bharat / jagte-raho

పోకిరీగాళ్లపై షీ టీం పంజా.. 3 నెలల్లో 74 మంది అరెస్ట్​ - షీ టీం తాజా వార్తలు

మహిళలు, యువతులను వేధిస్తోన్న పోకిరీలపై షీ టీం పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. మూడు నెలల కాలంలో రాచకొండ కమిషనరేట్​ పరిధిలో 74 మందిని అరెస్ట్​ చేశారు. తాజాగా ఇద్దరిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. బాల్య వివాహాలను సైతం అడ్డుకోవడంలో షీ టీం ముఖ్య పాత్ర పోషిస్తోంది.

she team arrested 74 accused persons with in span of 3 months
పోకిరీగాళ్లపై షీ టీం పంజా.. 3 నెలల్లో 74 మంది అరెస్ట్​
author img

By

Published : Dec 11, 2020, 8:07 PM IST

మహిళలు, యువతులను వేధించే పోకిరీలను షీ టీం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మూడు నెలల వ్యవధిలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 74మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 38 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించగా 33 మందిపై సాధారణ కేసు నమోదు చేసి వదిలి పెట్టారు. మరో 6 మందికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

షీటీం పోలీసులు అరెస్ట్ చేసిన వాళ్లలో ఎంబీబీఎస్ విద్యార్థి కూడా ఉన్నాడు. ఉప్పల్ ప్రాంతంలో నివసించే పాలగంటి సాయి కుమార్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా సాయికుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. 13ఏళ్ల బాలికతో కూడా ఇలాగే ప్రవర్తించినట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. ఆ విద్యార్థిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

she team arrested 74 accused persons with in span of 3 months
తల్లిదండ్రుల సమక్షంలో షీ టీం కౌన్సిలింగ్​..

మరో చోట

ఫేస్​బుక్ ద్వారా ప్రైవేట్ లెక్చరర్​తో పరిచయం పెంచుకొని నగ్న దృశ్యాలు సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న అస్లాం అనే యువకుడిని కూడా షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. నృత్యం నేర్పిస్తానని నమ్మించి కొంత మంది విద్యార్థినిలను లొంగదీసుకొని బెదిరింపులకు పాల్పడినట్లు తేలడంతో అతనిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. బాల్య వివాహాలను సైతం షీటీం పోలీసులు అడ్డుకుంటున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 7 బాల్య వివాహాలను అడ్డుకొని, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఇదీ చదవండి: కొనసాగుతోన్న వరద సాయం.. ఒక్కరోజే రూ. 9.79 కోట్లు జమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.