ETV Bharat / jagte-raho

తహసీల్దార్​ సుజాతను కస్టడిలోకి తీసుకునే అవకాశం! - షేక్‌పేట తహసీల్దార్ తాజా వార్తలు

హైదరాబాద్ షేక్‌పేట తహసీల్దార్‌ సుజాతను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్‌లోని కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి వివాదం కేసులో లంచం తీసుకున్నట్లు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే రూ.15లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ నాగార్జునరెడ్డితోపాటు.. ఆ సెక్టార్‌ ఎస్​ఐ రవీంద్రనాయక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

షేక్‌పేట తహసీల్దార్‌  అరెస్టు
షేక్‌పేట తహసీల్దార్‌ అరెస్టు
author img

By

Published : Jun 9, 2020, 5:52 AM IST

Updated : Jun 9, 2020, 6:31 AM IST

షేక్‌పేట తహసీల్దార్‌ అరెస్టు

హైదరాబాద్‌లో షేక్‌పేట తహసీల్దార్ పరిధి అంటేనే కాసులపంట. స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లతో కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటాయి. బంజారాహిల్స్ రోడ్‌ 14లో ఉన్న సుమారు ఎకరంపైగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకు ఏకంగా తహసీల్దార్ సుజాతే రంగంలోకి దిగిందని అధికారులు తెలిపారు. న్యాయస్థానం విచారణలో ఉన్న ఈ భూమిని ఖాలిద్ అనే వ్యక్తికి అనుకూలంగా రికార్డు తయారు చేసేందుకు ఆర్​ఐ నాగార్జునరెడ్డి సాయంతో రూ.30లక్షలకు కట్టబెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అది కాస్త వాయిదా పడింది.

డబ్బుల కోసం వేధింపులు..

అధికారులంతా కలిసి ఖాలిద్‌ను డబ్బుల కోసం వేధించడం ప్రారంభించారు. ఈ క్రమంలో శాంతిభద్రతల సమస్య రాకుండా ఉండేందుకు బంజారాహిల్స్ ఎస్‌ఐ రవీంద్రనాయక్‌కు రూ.లక్షా 50వేలు ఆశ చూపారు. అధికారుల కుట్రను బయటపెట్టేందుకు ఖాలిద్‌ అనిశాను ఆశ్రయించాడు. అవినీతిపరులను పట్టుకునేందుకు అనిశా అధికారులు ప్రణాళిక రచించి ఖాలిద్‌ను రంగంలోకి దింపారు. అతని ద్వారా రూ.15 లక్షలు నాగార్జునరెడ్డి తీసుకుంటుండగా మాటువేసి పట్టుకున్నారు. మరోవైపు ఎస్‌ఐ రవీంద్రనాయక్ లంచం తీసుకున్నట్లుగా సాంకేతిక ఆధారాలతో నిర్ధరించి అరెస్టు చేశారు. వీరిద్దరిని రెండు రోజుల పాటు విచారించి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

కస్టడిలోకి తీసుకునే అవకాశం!

రూ.కోట్లు విలువ చేసే భూబాగోతం తహసీల్దార్​ కనుసన్నుల్లోనే జరిగి ఉంటుందని భావించిన అనిశా అధికారులు... ఆ కోణంలో విచారణ జరిపారు. మూడు రోజులపాటు తహసీల్దార్ సుజాతను నాంపల్లి కార్యాలయంలో విచారించి నిందితురాలిగా తేల్చారు. సోమవారం రాత్రి అరెస్టు చేసి అనిశా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో మరింత లోతుగా విచారించేందుకు సుజాతను కస్టడిలోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆమె ఇంట్లో దొరికిన నగదు, ఆభరణాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వనందున ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఇంట్లో దొరికిన నగదు వ్యవహారంపై ఆమె భర్త స్టేట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు.

విస్మయానికి గురి చేస్తోంది

గతంలో హయత్‌నగర్ తహసీల్దార్​ లావణ్య కేసులో సుమారు రూ.90లక్షలు అవినీతి కేసు తర్వాత తాజాగా షేక్‌పేట తహసీల్దార్​ సుజాత కేసు రావడం విస్మయానికి గురి చేస్తోంది.

ఇవీ చూడండి: కుమార్తెకు దిండు అదిమి పెట్టి చంపిన తల్లిదండ్రులు

Last Updated : Jun 9, 2020, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.