ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరంలోని రెండో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ బాలిక (15)పై సొంత బావే లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితుడు బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉండడం వల్ల యువతిని వైద్య పరీక్షల కోసం కేజీహెచ్‌కు కుటుంబీకులు తీసుకువెళ్లారు. ఆమెను పరిశీలించిన వైద్యులు గర్భం దాల్చినట్లు తేల్చారు. ఈ విషయంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేశారు. దిశ పోలీసు స్టేషన్ ఏసీపీ ప్రేమ్‌కాజల్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకుని మంగళవారం జైలుకు తరలించారు.
ఫిర్యాదు ఇవ్వకపోయినా....
యువతిపై అఘాయిత్యానికి పాల్పడింది సొంత అత్త కొడుకే కావడంతో బాధితురాలు ఫిర్యాదు కూడా ఇవ్వలేదు. ఫిర్యాదు ఇవ్వడానికి కూడా నిరాకరించినట్లు సమాచారం. మైనర్ అనుమతి ఉన్నప్పటికీ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవడం చట్టప్రకారం నేరమన్న కోణంలో.. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.