ETV Bharat / jagte-raho

అక్రమంగా తరలిస్తోన్న రేషన్ బియ్యం పట్టివేత.. కేసు నమోదు - వికారాబాద్ జిల్లా నేర వార్తలు

రేషన్​ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పక్కదారి మళ్లిస్తున్నారు. పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ.. ఎక్కువ ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. వికారాబాద్​ జిల్లాలో అక్రమంగా రేషన్​ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Seizure of ration rice being smuggled .. Case registered
అక్రమంగా తరలిస్తోన్న రేషన్ బియ్యం పట్టివేత.. కేసు నమోదు
author img

By

Published : Sep 7, 2020, 6:57 AM IST

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అక్రమంగా తరలిస్తోన్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఓ వాహనంతో పాటు 22 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇమ్రాన్ గత కొంత కాలంగా పేదల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నాడు. ఈ క్రమంలో ఇమ్రాన్​ ఆదివారం రేషన్​ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టణంలోని సర్దార్ పటేల్ కూడలి వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఓ వాహనం, 22 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

Seizure of ration rice being smuggled .. Case registered
అక్రమంగా తరలిస్తోన్న రేషన్ బియ్యం పట్టివేత.. కేసు నమోదు

నిందితుడు పరారీలో ఉన్నట్లు పట్టణ సీఐ రవికుమార్​ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీచూడండి.. ద్విచక్రవాహనం అదుపు తప్పి యువకుడు దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.