ETV Bharat / jagte-raho

అక్రమంగా నిల్వ ఉంచిన 60 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

author img

By

Published : Oct 9, 2020, 12:09 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 60 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు, ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Illegal Ration Rice Caught by revenue officers
అక్రమంగా నిల్వ ఉంచిన 60 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 60 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని ఘటన కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలో పోలీసులు, ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు పట్టుకున్నారు. కాగజ్​నగర్​ పట్టణంలోని బుట్టపల్లి రోడ్​లో రెండు గోదాముల్లో రేషన్​ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఆ గోదాముల్లో పట్టణ ఎస్సై వెంకటేశ్​ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు.

ఒక రేకుల షెడ్​లో సుమారు 60 సంచులు లభించగా మరో గోదాంలో 50 సంచులు లభించాయి. రేషన్​ బియ్యాన్ని పీఎస్​కు తరలించి.. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు.. వ్యక్తి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.