ETV Bharat / jagte-raho

ప్రభుత్వ పనులని చెప్తూ... యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

కొన్ని రోజులుగా కురిసిన వర్షం వారి అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు కాస్త తెరిపి ఇచ్చిందో లేదో... వారి దందా మళ్లీ మొదలైంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకోసమని అనుమతులు పొంది... అక్రమంగా ఇసుకను రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. అధికారుల అండదండలు కూడా ఈ దళారులకు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

author img

By

Published : Sep 24, 2020, 11:23 PM IST

sand smuggling in narsimhulapet mandal in mahabubabad district
ప్రభుత్వ పనులని చెప్తూ... యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతోంది. జయపురం శివారులోని ఆకేరు వాగులో ఇసుక రవాణా కొంతకాలంగా జరుగుతోంది. కొన్నిరోజులుగా వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో తాత్కాలికంగా రవాణా నిలిచిపోయింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఇసుక రవాణా జోరందుకుంది.

అనుమతులు పొంది..

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులైన సిమెంటు రోడ్లు, మిషన్‌ భగీరథ, రెండు పడకగదులు, రైతు వేదికల పేరున అధికారుల నుంచి దళారులు అనుమతులు పొందుతున్నారు. కూపన్లు పొందిన దళారులు ఇదే అదునుగా భావించి... పరిమితికి మించి ఇసుకను తరలిస్తూ... సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

సొమ్ము చేసుకుంటూ..

ట్రిప్పునకు రూ.5 వేలకు పైగా ధర ఇస్తుండడంతో ట్రాక్టర్లు ఉన్న వారంతా ఇసుక రవాణా వైపు మొగ్గు చూపుతున్నారు. వాగు నుంచి గ్రామం వరకు కిలో మీటరు పొడవున ట్రాక్టర్లు బారులు తీరాయి. కూలీలు నీటిలోని ఇసుకను బయటకు తీసి కుప్పలుగా పోసి... అనంతరం ఇసుకను ట్రాక్టర్లలో నింపి మహబూబాబాద్‌, తొర్రూరు, ఖమ్మం, కేసముద్రం వంటి పట్టణాలకు తరలించి... దళారులు సొమ్ము చేసుకుంటున్నారని రైతులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘింస్తూ...

కూపన్లు పొందిన వారు నిబంధనల ప్రకారం రోజుకు కొన్ని ట్రిప్పులే తరలించాల్సి ఉన్నా... ఇక్కడ అధికారుల అండదండలతో అడ్డదారిలో తరలిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెక్‌ డ్యామ్​కు దగ్గరగా ఇసుక తవ్వకాలు జరుపుతుండటంతో డ్యామ్ కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లు పెద్ద ఎత్తున వస్తుండటంతో వాగు వద్ద జాతరను తలపిస్తోంది.

ఇదీ చూడండి: డ్రగ్స్​: వ్యసనం.. వ్యాపారం.. అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.