ETV Bharat / jagte-raho

గుర్తు తెలియని దుండగుల చేతిలో రౌడీషీటర్​ హత్య - రౌడీ షీటర్​ హత్య వార్తలు

గుర్తు తెలియని దుండగులు ఓ రౌడీషీటర్​ను దారుణంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

rowdy sheeter murder at chandra nagar in hyderabad
గుర్తు తెలియని దుండగుల చేతిలో రౌడీషీటర్​ హత్య
author img

By

Published : Aug 16, 2020, 8:08 AM IST

హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పోలీస్ స్టేషన్​ పరిధిలోని చంద్రనగర్​లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ రౌడీ షీటర్​ను హత్య చేశారు.

రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే అయాజుద్దీన్​ అలియాస్ కండ అయాజ్ అనే రౌడీ షీటర్​పై కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్త స్రావంతో అయాజ్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న రైన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచూడండి: చాదర్​ఘాట్​లో రౌడీషీటర్ సజీద్​ దారుణహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.