హైదరాబాద్ గోషామహల్ పోలీస్స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ.. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతుడు గుడిమల్కాపూర్ నివాసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్.. పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. లారీని సీజ్ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: కాసేపైతే ఇంటికెళ్లేవాడు.. అంతలోనే కారొచ్చి...