ETV Bharat / jagte-raho

రోడ్డుపక్కన ఫోన్ మాట్లాడుతుంటే దూసుకొచ్చిన మృత్యువు - రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు పక్కన ఫోన్​ మాట్లాడుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడం వల్ల ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడికి ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కాగా.. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారం పోలీసులకు తెలిపినా.. పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.

Road Accident In Suryapet District
కారు, బైక్ ఢీ.. ఒకరి మృతి
author img

By

Published : Oct 9, 2020, 10:10 AM IST

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సయ్యద్​ నసీరుద్దిన్ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై​ ఆర్వపల్లి నుంచి జాజిరెడ్డి గూడెం గ్రామానికి వస్తున్నాడు. జాజిరెడ్డి గూడెం కొత్త కాలనీ వద్దకు రాగానే.. అతడికి ఫోన్​ వచ్చింది. బైక్​ రోడ్డు పక్కకు ఆపి.. ఫోన్​ మాట్లాడుతున్నాడు. అటుగా వేగంగా వస్తున్న కారు.. నసీరుద్దీన్​ను​​ ఢీకొట్టింది.

కారు వేగానికి నసీరుద్దీన్ ఎగిరి పక్కనే ఉన్న గోడకు తగలడం వల్ల.. తలకు బలమైన గాయమై స్పృహ కోల్పోయాడు. స్థానికులు వెంటనే స్పందించి.. సూర్యాపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ నసీరుద్దీన్​ మరణించాడు. మృతుడి భార్య సంవత్సరం క్రితమే అనారోగ్యంతో చనిపోయింది. మృతుడికి ఒక కుమారుడు.. ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కారు జాజిరెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన స్టాపర్లను ఢీకొట్టి ఎగిరి చాలా దూరంలో పడింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించినా.. స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: ఎమ్మెల్యే వివేకానంద క్షమాపణలు చెప్పారు: తహసీల్దార్ల సంఘం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.