ETV Bharat / jagte-raho

కంకర గుట్టను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... భార్య మృతి, భర్తకు గాయాలు - సిద్దిపేట జిల్లా తాజా వార్తలు

బక్రీద్‌ పండగ వేళ రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచింది. మర్కూక్‌ మండలం ఎర్రవల్లి సమీపంలో శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

కంకర గుట్టను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... భార్య మృతి,

author img

By

Published : Aug 2, 2020, 5:30 PM IST

సిద్దిపేట జిల్లా మర్కూక్​ మండలం ఎర్రవల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గజ్వేల్‌ మండలం శ్రీగిరిపల్లికి చెందిన మహమ్మద్‌ షాబుద్దీన్‌, రసూల్‌బీ దంపతులు ఇంటి వద్ద బక్రీద్‌ పండుగను పిల్లలతో కలసి శనివారం జరుపుకొన్నారు. అనంతరం మర్కూక్‌ మండలం దామరకుంటలో ఉన్న తమ బంధువులను కలసేందుకు ద్విచక్ర వాహనంపై రాత్రి 8.30 గంటల సమయంలో బయలు దేరారు. మార్గమధ్యలో ఎర్రవల్లి గ్రామం దాటిన తర్వాత రోడ్డుపై పోసిన కంకర కుప్పను వారు వెళుతున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. వాహనం అదుపు తప్పగా రసూల్‌బీ కిందపడి తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే చనిపోయింది.

భర్త షాబుద్దీన్‌ సైతం తీవ్ర గాయాలపాలవడంతో పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు మర్కూక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: రెండు కార్లు ఢీ... ఒకరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.