ETV Bharat / jagte-raho

రెండు ద్విచక్రవాహనలు ఢీ.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలో జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మృతుల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Road accident in Narsapur
రెండు ద్విచక్రవాహనలు ఢీ.. ఇద్దరు మృతి
author img

By

Published : Nov 9, 2020, 10:34 PM IST

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ గొల్లపల్లికి చెందిన గ్యారంగుల మల్లేష్ (38) నర్సాపూర్‌ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. తిరుమలాపూర్‌ గ్రామానికి చెందిన కంజర్ల బాబు (29) తుజాల్‌పూర్‌ గ్రామానికి చెందిన చౌటకూర్‌ మల్లేషం నర్సాపూర్‌కు వస్తున్నారు. లింగాపూర్‌ గ్రామ సమీపంలో రోడ్డుపై ధాన్యం కుప్పలు అరబెట్టారు. ఒకే పక్కన వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.

గ్యారంగుల మల్లేష్‌, కంజర్ల బాబు అక్కడికక్కెడే మృతి చెందగా.. చౌటకూర్‌ మల్లేషంకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని 108 వాహనంలో నర్సాపూర్‌ ప్రభుతాసుపత్రికి తరలించారు. రెక్కాడితేగాని డోక్కాడని కుటుంబాలు రోజు పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. గ్యారంగుల మల్లేష్​, కంజర్ల బాబు మృతి చెందడం వల్ల వారి గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.