మహబూబ్ నగర్ గ్రామీణ మండలం ఓబులయాపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పోతన్ పల్లి గ్రామానికి చెందిన కనకన్న పొలం పనులు పూర్తి చేసుకుని గ్రామానికి తిరుగు ప్రయాణమవుతూ .. తన మోటర్ సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కనకన్న (47) అక్కడికక్కడే మృతి చెందాడు.
గమనించకపోవడంతోనే..
మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర వైపు వెళ్తున్న కారు కనకన్న బైక్‌ని ఢీ కొట్టింది. రోడ్డు దాటుతుండటం.. కారు డ్రైవర్ గమనించకపోవడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు పేర్కొన్నారు. గ్రామ మత్స్యకార సంఘ సభ్యుడి వ్యవహరిస్తున్న మృతుడికి భార్యతో పాటు ..ఇద్దరు కూమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:'రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్‌కు ఆస్కారం ఉండకపోవచ్చు'