జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెలుగొండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా... మరొకరు గాయపడ్డారు. మంచిర్యాల జిల్లా రామకిష్టాపూర్‌కు చెందిన రమేష్, స్నేహితుడు వెంకటేష్‌తో కలిసి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా... గుర్తుతెలియని వాహనం.... వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంపై బుగ్గారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: లబ్... డబ్... లబ్... డబ్... కేవలం 24 గంటలే!