యాదాద్రి భువనగిరిజిల్లా రాయగిరి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం టాటా ఏస్ వాహనంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యలో రాయగిరి సమీపంలోని కట్ట మైసమ్మ దర్శనం చేసుకోవడానికి వాహనాన్ని రోడ్డు పక్కన పార్కింగ్ చేసి వెళ్లారు.
భువనగిరికి చెందిన దీపక్ అతని స్నేహితులు జీపులో అతివేగంగా యాదగిరి గుట్టకు వెళ్తుండగా రోడ్డు మీద పార్కింగ్ చేసిన వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో టాటాఏస్లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్సై రాఘవేంద్ర కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ చదవడి: సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్