ఖమ్మం జిల్లా వైరా మండలం పినపాక వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వైరా మండలం అష్ణగుర్తి గ్రామానికి చెందిన చిత్తారు శ్రీను అదే మండలం గౌండ్లపాలెంలో పాడిగేదెను కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. బేరం పూర్తయిన తర్వాత పినపాకలో బంధువుల ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో బంధువుల ఇంట్లో ఉన్న గాయత్రీ అనే యువతి ఫోన్ రీచార్జ్ కార్డు కావాలనడంతో ఆమెను తీసుకుని కూడలికి వెళ్లాడు.
ఖమ్మం-కొత్తగూడెం జాతీయ రహదారి దాటుతుండగా తల్లాడ వైపు నుంచి వచ్చే లారీ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడ మృతిచెందాడు. గాయాలతో ఉన్న యువతిని 108 అంబులెన్స్‌లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. శ్రీను ప్రమాదంలో మృతిచెందాడని తెలుసుకుని బంధువులు వస్తుండగా ప్రవీణ్, నవీన్ అనే యువకులను ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి... మరో వ్యక్తికి తీవ్ర గాయాలు