ETV Bharat / jagte-raho

డ్రైవర్​ నిద్రమత్తు.. ఇద్దరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు - ప్రకాశం జిల్లా ఒంగోలులో రోడ్డు ప్రమాదం

ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

ఏపీ: డ్రైవర్​ నిద్రమత్తు.. ఇద్దరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

author img

By

Published : Nov 22, 2020, 12:00 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా ఒంగోలు బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. టెంపో వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురు వాహనంలో చిక్కుకుని.. తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెనుపాడు గ్రామానికి చెందిన ఒక జంటకు శనివారం తిరుమలలో వివాహమైంది.

అనంతరం వధూవరులు ఒక వాహనంలో, రెండు కుటుంబాల బంధువులు 10 మంది మరో వాహనంలో తెనాలికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు సమీపంలోకి చేరుకోగానే బంధువులు ప్రయాణిస్తున్న వాహనం ముందు వెళ్తున్న లారీ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశాడు. ఈ క్రమంలోనే పెళ్లి బృందం వాహనం లారీని ఢీకొట్టింది. దాన్నుంచి తేరుకునేలోపే వెనుక నుంచి మరో వాహనం వచ్చి బలంగా ఢీకొట్టింది.

ప్రమాదానికి గురైన వాహనం
ప్రమాదానికి గురైన వాహనం

రెండింటి మధ్య పెళ్లి బృందం ప్రయణిస్తున్న వాహనం నుజ్జునుజ్జయింది. అందులో ప్రయాణిస్తున్న 10 మందిలో వరుడి మేనమామ సత్యనారాయణ(70), పెద్దమ్మ అన్నపూర్ణమ్మ(65) అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారు వాహనంలోనే చిక్కుకుపోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది క్రేన్‌ సాయంతో వారిని బయటకు తీశారు. అనంతరం క్షతగాత్రులను ఒంగోలు కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: మామడ వద్ద అదుపుతప్పిన కారు.. ఆరుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.