ETV Bharat / jagte-raho

బైక్​ను ఢీకొట్టిన కారు... యోగా శిక్షకుడి మృతి - కరీంనగర్​ జిల్లా లేటెస్ట్​ వార్తలు

అతి వేగం ఎంతో ప్రమాదకరమో మరోసారి ఈ ఘటన నిరూపించింది. రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనదారుడిని ఓ కారు మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కరీంనగర్​ జిల్లాలో జరిగింది.

road accident at lmd colony in karimnagar district
ఎల్​ఎండీ కాలనీలో మితిమీరిన వేగంతో బైక్​ను ఢీకొట్టిన కారు
author img

By

Published : Jan 3, 2021, 10:41 PM IST

కరీంనగర్-హైదరాబాద్ రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ద్విచక్రవాహనాన్ని ఇన్నోవా కారు మెరుపు వేగంతో ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

కరీంనగర్​ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద కరీంనగర్​కు చెందిన యోగా శిక్షకుడు మామిడాల సుధాకర్ ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్నారు. ఇంతలో అతివేగంతో వచ్చిన ఇన్నోవా బైక్​ను​ ఢీకొట్టింది. సుధాకర్​ గాల్లో తేలుతూ రోడ్డుపై పడి ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఎల్​ఎండీ కాలనీలో మితిమీరిన వేగంతో బైక్​ను ఢీకొట్టిన కారు

ఇదీ చదవండి: కొనుగోలు కేంద్రాల రద్దు ఆలోచన విరమించుకోవాలి : సీతక్క

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.