జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద పెను ప్రమాదం తప్పింది. టాటా ఏస్ వాహనంలో గేదెను తరలిస్తుండగా వాహనం నుంచి గేదె బయటకు దూకింది. దీనితో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. కారు అదుపు తప్పి పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొట్టింది.. స్తంభం విరిగి కారుపై పడింది.
అయితే కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు వ్యక్తులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఇవీ చూడండి: రఫేల్ జెట్ల విన్యాసాలు- శత్రువుల గుండెల్లో గుబులు