వరంగల్ గ్రామీణ జిల్లా తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
![road accident at Katraya in Vardhannapeta Mandal, Warangal Rural District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-36-12-ghora-roddu-pramadam-av-ts10144_12102020082856_1210f_1602471536_643.jpg)
కట్ర్యాల పెట్రోల్ బాంక్ సమీపంలో ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లు గుంతలు పడటంతో వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే వర్ధన్నపేట నుంచి వరంగల్ కూరగాయల కోసం వెళ్తున్న ఆటోను వెనకనుంచి వేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలు కాగా... ఇదే క్రమంలో వరంగల్ మార్కెట్లో పని చేసి బైక్పై వర్ధన్నపేటకు వెళ్తున్న నాగరాజు... ఎదురుగా వస్తున్న లారీ కింద పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
![road accident at Katraya in Vardhannapeta Mandal, Warangal Rural District](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-36-12-ghora-roddu-pramadam-av-ts10144_12102020082856_1210f_1602471536_443.jpg)
రోడ్డు ప్రమాదం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆటోలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన నాగరాజు వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: 60లీటర్ల నాటుసారా, 180 కిలోల బెల్లం పట్టివేత