పండగ కోసం సరకులు తీసుకొని ఆటోలో వస్తున్న మహిళలను మృత్యువు వెంటాడింది. ఏపీ కడప జిల్లా ముద్దనూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముద్దనూరు నుంచి పెద్ద దుడ్యాల వైపు వెళ్తుండగా పులివెందుల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఊహించని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అత్తా కోడళ్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
కడప జిల్లాలో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి - road accident at kadapa news
పండగ కోసం సరకులు తీసుకొని ఆటోలో వస్తున్న మహిళలను మృత్యువు వెంటాడింది. ఏపీ కడప జిల్లా ముద్దనూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కడప జిల్లాలో ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ముగ్గురు మృతి