రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం గోపాలపురం సమీపంలో.. నాగారం- తుంగతుర్తి ప్రధాన రహదారిపై జరిగింది.
అడ్డగూడూరు మండలానికి చెందిన బోళ్ల యాకయ్య బైక్ పై నాగారం మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి మరో వ్యక్తితో కలిసి శుభకార్యానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గోపాలపురం సమీపంలోని కల్వర్టు వద్ద ప్రమాదకరంగా ఉన్న గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం తిరుమలగిరి ఆస్పత్రికి తరలించారు. గుంతను పూడ్చివేసి.. ప్రమాదాలను నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: సీఐ ఫేస్బుక్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు